Nestle says not exiting India, Maggi will be back in Indian markets soon

Bringing back maggi on shelves is top priority says nestle india

Maggi, Nestle India, Maggi quality issue, Companies, Nestle India Limited, Managing Director Suresh Narayanan, maggi, maggi ban, economy, business and finance, standards and benchmarks, Maggi instant noodles, shelves, number one priority, new Managing Director

Getting Maggi back on the shelves is the number one priority for Nestle India's new Managing Director Suresh Narayanan.

మ్యాగీని త్వరలోనే ఇండియాలోకి తీసుకువస్తాం

Posted: 08/01/2015 10:01 PM IST
Bringing back maggi on shelves is top priority says nestle india

దేశ వ్యాప్తంగా నిషేధానికి గురైన మ్యాగీ న్యూడుల్స్‌ను మళ్లీ మార్కెట్లలోకి తీసుకువస్తామని నెస్లె ఇండియా నూతన అధినేత సురేష్ నారయణ్ పేర్కొన్నారు. మ్యాగీ తయారీలో సీసం వాడకం అధికంగా ఉందంటూ ఇటీవల దాని అమ్మకాలు దేశవ్యాప్తంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెస్లె ఇండియాకు ఎండీగా ఉన్న ఎటైన్ బెనెట్ జులై 25న తన పదవి నుంచి దిగిపోయారు. ఈ క్రమంలో భారత్‌లో వ్యాపారాలను తిరిగి మెరుగుపరిచేందుకు మనిలాలో పనిచేస్తున్న సురేష్ నారయణ్‌(55)ను నెస్లే ఇండియా చీఫ్‌గా సంస్థ నియమించింది.

ఈ మేరకు సురేష్ శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యాగీ తయారీపై తాము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నందున ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనన్నారు. సోమవారం బాంబే హైకోర్టు ఈ కేసులో తన తీర్పును వెల్లడించనుందని, కోర్టు తీర్పుననుసరించి త్వరలోనే మ్యాగీ అమ్మకాలు మొదలుపెడతామని చెప్పారు. మ్యాగీతో పాటుగా డెయిరీ ఉత్పత్తులు, చాక్లెట్లు అన్నింటి అమ్మకాలను పెంచడం ద్వారా భారత్‌లో తమ మార్కెట్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నాలు చేస్తామన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maggi  Nestle India  Suresh Narayanan  

Other Articles